Menu
lb sriram

ఎల్.బి.శ్రీరాం తీసిన లఘుచిత్రాలు (చూడడానికి క్రింది లింకులను క్లిక్ చేయండి)

 

కొన్ని దశాబ్దాలుగా తెలుగు వారిని తన సినీనటనా వైదుష్యంతో ఆకట్టుకుంటున్న యల్.బి. శ్రీరాం రచయితగా, నటుడిగా ఎన్నో సత్కారాలనందుకున్నారు. యల్.బి. శ్రీరాం ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. నాటక రంగంలో ఎన్నో విజయాలను సాధించిన వీరు సినీరంగంలో ప్రవేశించి నాలుగు వందలకి పైగా సినిమాల్లో నటించారు. ఎన్నో విభిన్న పాత్రలను పోషించిన వీరు తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో ఒక చక్కటి స్థానాన్ని సంపాదించుకున్నారు.
అంతేకాక ఎన్నోసూపర్ హిట్ సినిమాలకు రచయితగా కూడా పనిచేసారు. స్వయంకృషికి పట్టుదల జోడించిన యల్.బి. శ్రీరాం తెలుగు సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు. నవరసాల్లో ఏ రసాన్నైనా అద్భుతంగా పండించగల యల్.బి. శ్రీరాం హాస్యంతో కడుపుబ్బ నవ్వించగలరు. ఆర్టిస్టుగా కన్నీళ్ళు పెట్టించగలరు. సీరియస్ పాత్రల్లోనూ ఇట్టే ఒదిగిపోతారు. తనదైన ఒరవడిలో వీరు పలికే డైలాగులు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తాయి. పదే పదే గుర్తొస్తుంటాయి.

 

యల్.బి. క్రియేషన్స్ (Life is Beautiful) పేరిట యల్.బి. శ్రీరాం ఇటీవల రూపొందిస్తున్న లఘు చిత్రాలు ఎంతో చక్కటి పేరు తెచ్చుకుంటున్నాయి. స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాల్లో సున్నితమైన కథాంశాలుంటాయి. మానవీయ విలువలుంటాయి. సంస్కృతీ సంప్రదాయాలుంటాయి. కుటుంబ బంధాల గొప్పతనం తెలియచెబుతాయివి. ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ చిత్రాల్లో చక్కటి కథాకథనాలుంటాయి. ఊహించని మలుపులుంటాయి. ఈ లఘు చిత్రాలని చూడండి. ఆస్వాదించండి. పదిమందికి వాటి గురుంచి తెలియచెప్పండి. యల్.బి. క్రియేషన్స్ చానల్ కి Subscribe అవ్వండి. మిత్రులచే Subscribe చేయించండి.